Apr 08,2021 19:39

అఖిల్‌ అక్కినేని 5వ చిత్రం 'ఏజెంట్‌' ఫస్ట్‌లుక్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదల చేశారు. రఫ్‌ లుక్‌లో సిగరెట్‌ తాగుతూ ఉన్న అఖిల్‌ లుక్‌ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో రెండవ స్థానంలో ఉంది. ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి 'ఏజెంట్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సురేందర్‌ 2 సినిమా' బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మంతో కలిసి దర్శకుడు సురేందర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.