Dec 03,2021 22:07

తనకు స్పోర్ట్స్‌ అంటే ఇష్టమని, తాను స్టేట్‌ లెవెల్‌ స్విమ్మరని, తన అమ్మ నేషనల్‌ లెవెల్‌ స్విమ్మర్‌ తనకు స్విమ్మింగ్‌ బేస్డ్‌ సినిమా వస్తే చేస్తాను అని కేతిక శర్మ అంది. నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం 'లక్ష్య'. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌గా కేతిక శర్మ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. మొదటి సినిమా రొమాంటిక్‌ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేశానన్నారు. అలా పూరి జగన్నాథ్‌ పిలవడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. రొమాంటిక్‌ సినిమాలో గ్లామరస్‌ రోల్‌లో నటించానన్నారు. ఇందులో మాత్రం ఎమోషనల్‌ పాత్రలో కనిపిస్తానన్నారు.ఆర్చరీ మీద సినిమాలు ఇంత వరకు సినిమాలు రాలేదన్నారు. అందుకే ఇంట్రెస్ట్‌గా అనిపించి ఈ సినిమాను చేయాలనిపించిందనాఇ వివరించారు. ఈ సినిమా సమయంలో ఎంతో మంది ఆర్చర్స్‌ను కలిసి, ఆర్చరీ గురించి కొంచెం నేర్చుకున్నానన్నారు. ప్రస్తుతం తన మూడో ప్రాజెక్ట్‌ వైష్ణవ్‌ తేజ్‌తో చేస్తున్నానన్నారు. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదని, అదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో కాలేజ్‌, ప్రేమ చుట్టూ తిరుగుతుందని, అదొక డైనమిక్‌ స్టోరి అని వివరించారు.తన జీవితంలో ఒకే ఒక్క కల నటిని అవ్వాలని అనుకున్నానన్నారు. . అయ్యాను కానీ అదెలా జరిగిందో తనకు కూడా తెలియదన్నారు. తన పేరెంట్స్‌ డాక్టర్స్‌. తనకు ఇండిస్టీతో సంబంధం లేదని, వారు తనకు ఓ ఏడాది టైం ఇచ్చారని . అంతలోనే నటిని అయ్యాను.