శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవాలి : తహసీల్దార్ కుశరాజు

08 ఆగస్టు, 2026

Applications must be submitted to correct errors in the voters' list: Tahsildar Kusharaju.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఓటర్ల జాబితాలో మీ పేరు, చిరునామా, ఇతర వివరాలలో తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం ఫారమ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిందని తహసిల్దార్ కందుల కుశరాజు అన్నారు. ఈ మేరకు శనివారం మండల రెవెన్యూ కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) భాగంగా ఓటర్లులందరికీ ఎన్యూమరేషన్ ఫారం లు పంపిణీ చేసి బిఎల్ఓ లు వెరిఫికేషన్ అనంతరం డ్రాప్ ఓటర్ లిస్ట్ సంబంధిత పోలింగ్ స్టేషన్లో ప్రచురణ ప్రతులు అందజేయడం జరిగిందన్నారు. వాటిపై అభ్యంతరాలు తెలియజేయ వచ్చునన్నారు. అలాగే మ్యాపింగ్ కానీ కేసులు, ఎనామిలిస్ ఓటర్లకు నోటీసులు పంపించడం జరుగుతుందన్నారు. బిఎల్ఓ లు వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ లిస్టు ప్రచురించడం జరుగుతుందన్నారు. అయితే ముందుగా ఓటర్ల జాబితాలో మీ వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. జాబితా మీ పరిధిలోని బిఎల్ఓ దగ్గర అందుబాటులో ఉందన్నారు. తప్పుడు నమోదులు ఉన్నట్లు గుర్తించినట్లు యెడల వాటిని ఒప్పులుగా సరిదిద్దడానికి, మీ స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్ (బిఎల్ఓ) ద్వారా ఆఫ్‌లైన్‌లో గాని, నేరుగా గాని దరఖాస్తు చేయవచ్చు అన్నారు. అలాగే అధికారిక పోర్టల్(ఓటర్ హెల్ప్ లైన్ యాప్) ద్వారా ఆన్‌లైన్‌లో మార్పులు కోరవచ్చు అన్నారు. పేరు, వయస్సు, ఫోటో, అడ్రస్ తప్పులను మార్చడానికి ఫారం-8 నింపాలన్నారు. తప్పులను సరిదిద్దడానికి సరైన గుర్తింపు, జనన ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు. ఫారం-6 తో కొత్త ఓటరు నమోదు చేసేందుకు గాను, ఫారం-7 తో జాబితాలో అనర్హులు, మృతుల పేర్ల తొలగింపులు కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఫారాలతో పాటు అర్హత పత్రాలు జిరాక్స్లు తప్పనిసరిగా జత చేసి అందజేయాలన్నారు. అనుమానాల నివృత్తి కొరకు స్థానిక బిఎల్ఓ లను సంప్రదించాలని ఆయన సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్