Oct 28,2021 16:28

ప్రజాశక్తి -లింగపాలెం
లింగపాలెం మండలంలోని ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని జన సేన నాయకులు మేక ఈశ్వరయరారోపించారు. ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని కోరుతూ జన సేన మండల కమటీ ఆధ్వర్యంలో దర్మాజీగూడెం మెయిన్‌రోడ్డుపై గురువారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ శ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుండటంతో గుత్తేదారులు అరకొరగా పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అక్కడక్కడా తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కొట్టుకుపోయి మరింత దయనీయంగా మారాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేక ఈశ్వరయ్య, కుర్ర సుబ్రహ్మణ్యశ్వర వర ప్రసాద్‌, మాదాసు కఅష్ణ చిన్నం సతీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.