Oct 28,2021 20:47

విజయనగరంలోని కోట జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేస్తున్న వామపక్ష నాయకులు, ప్రజలు
 పార్వతీపురంలో ఆర్‌టిసి కాంప్లెక్సు కూడలిలో రాస్తారోకో చేస్తున్న వామపక్ష నాయకులు, ప్రజలు
పార్వతీపురంలో ఆర్‌టిసి కాంప్లెక్సు కూడలిలో రాస్తారోకో చేస్తున్న వామపక్ష నాయకులు, ప్రజలు

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యాన ప్రజలు భగ్గుమన్నారు. ధరలు తగ్గించకపోతే మోడీ పాలనకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.
విజయనగరం టౌన్‌ : విజయనగరం కోటజంక్షన్‌ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహంచారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌, సిపిఐ ఎంఎల్‌ నాయకులు బెహరా శంకరరావు మాట్లాడారు. కేేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రతి రోజూ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతూ సామాన్యులపై భారాలు వేస్తుందన్నారు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు, పేదల అనేక ఇబ్బందులు పడుతున్నా రన్నారు. కేవలం కార్పొరేట్‌ కంపెనీలకు ఆదాయం పెంచేలా మోడీ పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. మోడీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకరరావు, పి.రమణమ్మ, ఎ.జగన్మోహన్‌, బి.రమణ, సిపిఐ నాయకులు రంగరాజు, జీవ, వామపక్షాల కార్యకర్తలు పాల్గొన్నారు. భోగాపురంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సూర్యనారాయణ ఆధ్వర్యాన ఆటో లాగుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎం.రవి, ఎన్‌.సూర్యనారాయణ, బి.నర్సినాయుడు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు కూడలిలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి పి.సంగం, రైతు కూలీ సంఘం నాయకులు బి.నర్సింగరావు, పి.రమణి, సిపిఐ ఎంల్‌ నాయకులు డి.వర్మ, సిఐటియు, పట్టణ పౌరసంక్షేమ సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, గ్యాస్‌ సంఘం నాయకులు గొర్లి. వెంకటరమణ, ఎస్‌.ఉమామహేశ్వరావు, పాకల, సన్యాసిరావు, పి. రాజశేఖర్‌, బి.లక్ష్మి, తులసి, జి.వెంకటరమణ పాల్గొన్నారు. కొత్తవలస జంక్షన్‌లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో, ముఠా కార్మికులు పాల్గొన్నారు. గజపతినగరం నాలుగు రోడ్ల కూడలి వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యుడు జి.శ్రీనివాస్‌, నాయకులు డి.సింహాద్రి, ఆర్‌.హరికృష్ణవేణి, సిపిఐ నాయకులు ఎం.శ్రీను, గేదెల రామ నాయుడు, ఆదినారాయణ, సిఐటియు నాయకులు కృష్ణ, జె.కృష్ణ, రాము, సామాజిక చైతన్య వేదిక నాయకులు రాకోటి గోపాలరావు పాల్గొన్నారు. కురుపాం మండలంలోని రావాడ జంక్షన్‌ వద్ద సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మానవహారం చేచేపట్టారు. గుమ్మలక్ష్మీపురంలో సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. తొలుత గుమ్మలక్ష్మీపురం నుంచి ఎల్విన్‌పేట వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, కోలక అవినాష్‌, ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రమణ, సిఐటియు మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, గిరిజన సంఘం మండల నాయకులు బిడ్డిక శంకర్రావు, ఎం.సన్యాసిరావు, పువ్వల మోహనరావు, సత్యం ఆడిత్‌, కుక్కిడి సర్పంచ్‌ బిడ్డిక రాజారావు ఉన్నారు. శృంగవరపుకోట పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో సిహెచ్‌ ముత్యాలు, గణేష్‌, జి.నాయుడు, కె.దేవుళ్లు, కె.రవి, సాంబ, ఉత్తరాన రాము, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల పట్టణంలోని మొయిద జంక్షన్‌లో వామపక్షాల ఆధ్వర్యాన రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు కిల్లంపల్లి రామారావు, టి.సన్ని బాబు, పి.మల్లిక్‌, ఎం.పాపారావు, బి.వి.సత్యం, డి.తాతారావు పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు సిపిఎం ఆధ్వర్యాన ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు, ఎ.కృష్ణ, పి.మోహన్‌రావు, లక్ష్మణరావు, అప్పారావు పాల్గొన్నారు. బలిజిపేట మండల కేంద్రంలో బస్టాండ్‌ వద్ద సిపిఎం, శ్రీహనుమాన్‌ ఆటోవర్కర్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు గేదెల సత్యనారాయణ, మండల కార్యదర్శి మన్మథరావు, ఆటో వర్కర్స్‌ సంక్షేమ సంఘం నాయకులు సీతారాం, కార్మికులు బాలరాజు, శ్రీను, జగన్‌, శ్రీహరి పాల్గొన్నారు. సాలూరు మండలంలో సారిక పంచాయతీ పరిధిలోని కొత్తూరులో సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జోగయ్య, సుకురు గంగయ్య పాల్గొన్నారు. సిపిఐ నాయకులు ఎస్‌.రామచంద్ర రావు ఆధ్వర్యాన పట్టణంలోని బోసు బొమ్మ జంక్షన్‌లో నిరసన చేపట్టారు. సీతానగరం మండలంలోని హనుమాన్‌ జంక్షన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, నాయకులు వెంకటరమణ, బి.అప్పారావు, కృష్ణ, రామారావు, తదితరులు పాల్గొన్నారు.