
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని యువ క్రికెటర్ కెఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ధోనీ పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో కీపర్‌గా రాహుల్ ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎలా ఉండాలో ధోనీ మనందరికీ చూపించాడని అన్నాడు. ధోనీ నుంచే మనమెంతో నేర్చుకున్నామని, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజాతో తనకు మంచి అవగాహన ఉందని, ఏది మంచి లెంగ్తో, ఎక్కడ బంతులు వేయాలో, ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలో తన సామర్థ్యం మేరకు వారిక సూచనలు చేస్తుంటానని పేర్కొన్నారు. టీమిండియా తరుఫున వికెట్ కీపింగ్‌ను ఆస్వాధిస్తున్నానని రాహుల్ తెలిపాడు.