May 16,2021 13:04

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరో వారం పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం వెల్లడించారు. క్రియా శీలక కేసులు 5 శాతానికి తగ్గని నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ' లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించాం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా సాధించిన లక్ష్యాలను కోల్పోవాలనుకోవడం లేదు. అందుకు వారం పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది' అని తెలిపారు.