Jan 15,2022 09:33

న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని ఒక ప్రముఖ ఫ్లవర్‌ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 3 కిలోల పేలుడు పద్ధారాలతో నిండిన ఒక బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. సుమారు 8 అడుగులు లోతున గొయ్యి తవ్వి బాంబ్‌ను అందులోనే నిర్వీర్యం చేశారు. ఈ బాంబ్‌తో భారీ నష్టం జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దీనిని ఈ నెల 26 రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ముందు ఒక తీవ్రవాద ప్రయత్నంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 9:30 గంటల ప్రాంతాలో మార్కెట్‌కు పూలు కొనేందుకు స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి బ్యాగ్‌ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు.