
ఒకే సినిమాలో రెండు విలక్షణమైన పాత్రలు నటించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. చాలామంది నటులు ద్విపాత్రాభినయ అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, విక్రమ్, కమల్ హాసన్, అమీర్ ఖాన్, సూర్య లాంటి స్టార్లు ఈ తరహాలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు.
కొన్నిసార్లు కథానాయికల ద్విపాత్రాభినయాలు కూడా సినీ అభిమానుల మన్ననలను అందుకున్నాయి. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారారు గతంలో నటించిన జీన్స్ సినిమా ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఇదే తరహాలో అయిదు సంవత్సరాల గ్యాప్ తరువాత ఐష్ రీఎంట్రీ ఇస్తున్నారు. ద్విపాత్రాభినయంలో కంబ్యాక్ అదరగొట్టాలన్న పంతంతో వస్తున్నారట.. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారారు. ఐష్ ప్రస్తుతం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నారు. ఆమె చివరిసారిగా ఏ దిల్ హై ముష్కిల్ లో రణబీర్ కపూర్ తో కలిసి నటించారు.
ఒక పాత్రలో పాజిటివ్‌గా.. మరో పాత్రలో విలన్‌గా ఐష్..
మణిరత్నం సినిమాలో మందాకిని దేవిగా..నందినిగా ఐశ్వర్యారారు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో పాజిటివ్ గా కనిపిస్తే మరో పాత్రలో విలన్ గా కనిపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఇటీవల ఒక భారీ సెట్ లో పాట చిత్రీకరణను ముగించారు. చియాన్ విక్రమ్ సహా పలువురు క్రేజీ స్టార్లు ఇందులో నటిస్తున్నారు.
చారిత్రక నవల ఆధారంగా.. నాలుగు భాషల్లో సినిమా..
ప్రఖ్యాత రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రక నవల మూలాధారంగా ఈ సినిమా చిత్రీకరించబడుతోంది. రాజ రాజ చోళ అనే చక్రవర్తి జీవితకథ ను ఇందులో రచయిత నవలీకరించారు. నాలుగు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 2021 సౌత్ క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా పొన్నియన్ సెల్వన్ గురించి అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనేది దర్శక నిర్మాతలు ప్లాన్. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం రీఎంట్రీ ఇస్తోన్న ఐశ్వర్యరారు కు మరో హిట్‌ను అందిస్తుందా.. వేచిచూడాల్సిందే..