
కడపప్రతినిధి జిల్లాలో డ్వాక్రాబజార్ల ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. రాష్ట్రంలో పోలీస్ శాఖ క్యాంటీన్ల ద్వారా అందించే సేవల తరహాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లాలోని డ్వాక్రా సభ్యులకు తక్కువ ధరలతో నిత్యావసర సరుకులను అందించే విధానంలో భాగంగా మెరుగైన, నాణ్యమైన సరుకులను అందించాలనే తలంపుతో డ్వాక్రాబజార్ల ఏర్పాటుకు అంకురార్పణ చేసింది. పైలెట్ ప్రాజెక్టులుగా పులివెందుల, రాయచోటి పట్టణాల్లో డ్వాక్రాబజార్లను ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ 25న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫలితంగా జిల్లాలోని లక్షలాది డ్వాక్రా సంఘాల సభ్యులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు, కడప కార్పొరేషన్ పరిధిలోని 3.50 లక్షల మంది డ్వాక్రా సంఘాలు సభ్యులు ఉన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎస్‌హెచ్‌జి, ఎస్ఎల్ఎఫ్, టిఎల్ఎఫ్ సంఘాలు క్రియాశీలనమైన పాత్ర పోషించనున్నాయి. టిఎల్ఎఫ్ (టౌన్ లెవెల్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో డాక్రాబజార్ల ఏర్పాటు, నిర్వహణకు కసరత్తు ఊపందుకుంది. మొదటగా పులివెందులలోని 10 వేల మంది డ్వాక్రా సంఘాల సభ్యుల రూ.100 మూల పెట్టుబడి వ్యయంతో కూడిన నిత్యావసర సరుకులను అందించే బృహత్తర కసరత్తు ఊపందుకుంది. కడప కార్పొరేషన్లో రూ.50 లక్షలు, మున్సిపాలిటీల్లో 10 వేల మంది సభ్యుల రూ.100 చొప్పున మూల పెట్టుబడితో రూ.10 లక్షల వ్యయంతో కూడిన నిత్యావసర సరుకులను అందించే కసరత్తు ఊపందుకుంది. జిల్లాలోని రాయచోటి పట్టణంలోనూ డ్వాక్రాబజార్ను ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తు ఊపందుకుంది. ప్రభుత్వం డ్వాక్రా బజార్ల ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయ సహకారాన్ని అందించడంలో భాగంగా ప్రయివేటు భవనాలకు చెల్లించాల్సిన అద్దెలు చెల్లించే అవకాశం ఉంది. పులివెందుల, రాయచోటి అనుభవం అనంతరం జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు, కడప కార్పొరేషన్ ప్రాంతాల్లో డ్వాక్రాబజార్లను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు నాణ్యమైన నిత్యావసరాలను అందించడంలో భాగంగా విన్నూత కార్యక్రమానికి రూపకల్పన చేసింది. డిఆర్డిఎ ఆధ్వర్యంలో 36 వేల డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో సుమారు 42 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మెప్మా ఆధ్వర్యంలోని డ్వాక్రాబజార్ల విజయవంతమైన అనంతరం డిఆర్డిఎ ఆధ్వర్యంలోనూ డ్వాక్రా బజార్లు వెలిసే అవకాశాలు ఉంది. జిల్లాలో నాణ్యమైన నిత్యావసరాలు, మెరుగైన సేవలు డ్వాక్రా సంఘాల సభ్యులకందే అవకాశం ఉంది
డ్వాక్రాబజార్ల జయప్రదంపైనే దృష్టి
జిల్లాలో పులివెందుల, రాయచోటి పట్టణాల్లో ఏర్పాటు చేయనున్న డ్వాక్రా బజార్ల జయప్రదంపైనే దృష్టి కేంద్రీకరించాం. కలెక్టర్ హరికిరణ్ సహాయ సహకారాలతో బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేయడ మైంది.
- రామమోహన్‌రెడ్డి, మెప్మా పీడీ, కడప.