Dec 03,2021 22:36
  • ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
  • ప్రభావిత జిల్లాలకురూ.10 కోట్ల చొప్పున నిధులు : సిఎం

ప్రజాశక్తిా యంత్రాంగం : జవాద్‌ తుపాను ఉత్తరాంధ్రవైపు దూసుకొస్తోంది ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలు మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్రవాయుగుండం తుపానుగా బలపడింది. ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 480 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాలపూర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గంటకు30 కిలోమీటర్ల వేగంతో ఆగుేయ వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర - ఒడిశాలకు చేరువగా వచ్చి సాయంత్రం ఆంధ్రా- ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి డిసెంబరు ఐదున మధ్యాహ్నం నాటికి పూరి తీరానికి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌కు చేరనుంది. తుపాను కోస్తాంధ్ర సమీపానికి వచ్చే కొద్దీ శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల గంటకువీస్తాయనిపేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల ఐదో వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకువెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వైజాగ్‌ పోర్టు, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తీరం వెంబడి సిబ్బందిని పహారా ఉంచింది. విశాఖలోని తూర్పునౌకాదళం, వాల్తేరు, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలు అప్రమత్తమై సహాయక చర్యల దిశగా తమ సిబ్బందిని కేటాయింపులు చేశాయి. పూరి పాకల్లో, పాడుబడిన ఇళ్లల్లో నివాసాలు ఉండకూడదని, లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉంచడం, లేదంటే సురక్షిత ప్రదేశాలకుతరలించడం చేయానిప్రభుత్వం ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల్లోని 237 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంటుందని గుర్తించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక అధికారులను నియమించారు. 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాకురెండు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఒక ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకునాుయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర గ్రామాలైన చేపలకంచేరు, భోగాపురం మండలం ముక్కాంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం పర్యటించి మత్స్యకారులకు భరోసా కల్పించింది. మెంటాడ మండలంలోని ఆండ్ర రిజర్వాయర్‌ను జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పరిశీలించారు. ఈ డ్యాం పూర్తి సామర్థ్యం 98 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 94 టిఎంసిల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వలను తగ్గించేందుకు ఈ డ్యాం ప్రధాన గేటు నుంచి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టినట్లు చీఫ్‌ ఇంజినీర్‌ ఎస్‌.సుగుణాకర్‌రావు కలెక్టర్‌కు వివరించారు. తాటిపూడి రిజర్వాయర్‌ సామర్థ్యం 297 అడుగులు కాగా, ప్రస్తుతం 296.5 అడుగులు నీరు ఉంది. ఎగువ నుంచి 200 క్యూసెక్కులు నీరు వస్తుండగా, దిగువకు600 క్యూసెక్కుల నీటినివిడిచిపెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనిఉప్పాడ, ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద అలలు బీచ్‌ రోడ్డును తాకుతున్నాయి. జగ్గంపేట, గండేపల్లి, పిఠాపురం, యు.కొత్తపల్లి, తొండంగి, సామర్లకోట మండలాల్లో చెదురుమదులు జల్లులు పడ్డాయి. తుపాను నేపథ్యంలో శనివారం పాఠశాలలకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
95 రైళ్లు నిలిపివేత
తూర్పునౌకాదళంలో 13 ఫ్లడ్‌ రిలీఫ్‌ టీమ్స్‌ను నేవల్‌ కమాండ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ గుప్తా నియమించారు. మరో నాలుగు డైవింగ్‌ టీములను విశాఖ సముద్ర తీరాల్లో ఉంచారు. ఒడిశా నుంచి మరో రెండు డైవింగ్‌ టీములను తూర్పునౌకాదళం విశాఖకు రప్పించింది. ఫుడ్‌ మెటీరియల్స్‌ను, నౌకలు, హెలికాప్టర్లలో సిద్ధం చేసుకుంది. తూర్పుకోస్తా రైల్వేలో ఇప్పటికే 95 రైళ్లను నిలిపివేశారు. రైల్వే ట్రాక్‌ల పరిరక్షణ చేపట్టారు. రైల్వే బ్రిడ్జిల కింద నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు. వాల్తేరు రైల్వేలోనిమేజర్‌ స్టేషన్స్‌ అన్నిటినీ ఇంటరొట్‌తో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలిసే నెట్‌వర్క్‌ను రైల్వే ఏర్పాటు చేస్తున్నారు.
తుపాను ప్రభావిత జిల్లాలకు చొప్పున రూ.10 కోట్ల నిధులు : సిఎం
అధికారులు అ ప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం జగన్‌ 

జవాద్‌ తుపాను ప్రభావిత జిల్లాలకు సహాయ కార్యక్రమాలు, పనుల కోసం రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని, ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్‌ కట్టలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా చెరువులకు గండ్లు పడినా, బలహీనంగా ఉన్నాయని తెలిసినా వెంటనే జలవనరులశాఖ అధికారులతో మాట్లాడాలన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి పూర్తి అ ప్రమత్తంగా ఉన్నామని ఢిల్లీ నుంచి సమీక్షలో పాల్గొన్న సిఎస్‌ సమీర్‌శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే 11 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆరు కోస్ట్‌గార్డ్‌ బృందాలు, పది మెరైన్‌ పోలీసు బృందాలు, 18 ఫైర్‌ సర్వీస్‌ బృందాలను ఉత్తరాంధ్ర జిల్లాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు 115 జెసిబిలు, 115 టిప్పర్లు, 232నీళ్ల ట్యాంకర్లు, 295 డీజిల్‌ జనరేటర్లు, 46,322 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1018 మెట్రిక్‌ టన్నుల పప్పుధాన్యాలు, 41,032 లీటర్ల వంటనూనె, 391 టనుుల పంచదార ఆయా జిల్లాలకు పంపించామని తెలిపారు. ఎపి విపత్తుల నివారణ శాఖ కమిషనర్‌ ఎల్‌.కన్నబాబు శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు.
మెడికల్‌ క్యాంపుల ఏర్పాటు : వైద్యాధికారులకు మంత్రి ఆళ్ల ఆదేశం
తుపాన్‌ ప్రభావిత జిల్లాల్లోని పునరావాస కేందాల వద్ద ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని మందులూ అందుబాటులో ఉంచాలని డిప్యూటీ సిఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) ఆదేశించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో శుక్రవారం ఆయన టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో వైద్య బృందాలు మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని ఆదేశించారు.