Nov 25,2020 21:00

అనుష్క ప్రధాన పాత్రతో తెరకెక్కిన భాగమతి చిత్రాన్ని హిందీలో దర్శకుడు జీ అశోక్‌ రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో భూమి పడ్నేకర్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. సీబిఐ ఆఫీసర్‌ పాత్రలో అర్షద్‌ వాసి, కిరణ్‌ కపాడియా నటించారు. డిసెంబర్‌ 11న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.