Dec 05,2021 19:08

దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - గూడూరు రూరల్‌ : జనవిజ్ఞాన వేదదిక ఆధ్వర్యంలో నెల్లూరు వాసి ప్రతాప్‌ సింగ్‌ దాతృత్వంతో ఇటీవల కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన జక్కావెంకయ్య శ్రామికనగర్‌ వాసులకు ఆదివారం దుప్పట్లు పంపిణీ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం మోహన్‌ రావు వీటిని అందజేశారు.ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుం టుందన్నారు.నిరాశ్రయులైన నిరుపేదలకు దుప్పట్లు పంపిణి చేయడం సంతోషకరంగా ఉందన్నారు.జెవివి గూడూరు శాఖ రాష్ట్రలోనే గొప్పగ పని చెస్తుందన్నారు. ఈ కార్యక్ర్రమానికి దాతగ వ్యవహరించిన ప్రతాప్‌ సింగ్‌ ని అభినందించారు. నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్‌ యాదగిరి, జెవివి అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్‌, నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమ్‌ రావు, మురళీసింగ్‌, శ్రీను, అశోక్‌, విష్ణు, సురేష్‌, సిపిఎం నాయకులు పామంజి మణి, జోగి శివకుమార్‌, బివి రమణయ్య, వెంకట్రావు పాల్గొన్నారు.