
జిఎస్టి సువిధ సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పీతాళ్ల మస్తాన్‌రావు
ప్రజాశక్తి - తాడేపల్లి : పట్టణంలోని డొలాస్నగర్లో జిఎస్టి సువిధ సెంటర్‌ను పిఇపిఎల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పీతాళ్ల మస్తాన్‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మెయిన్ ఇంజనీర్ కుమార్‌రాజా, జిఎస్టి సువిధ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.