Nov 18,2020 16:53

నాగాయలంక (కృష్ణా) : 1977 నవంబర్‌ 19 దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు. ఇప్పటికీ దివిసీమ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.
       అది ఒక కాళరాత్రి. 1977 నవంబర్‌ 19 అర్ధరాత్రి సముద్రుడు ఉగ్రరూపం దాల్చి గ్రామాలపై విరుచుకుపడ్డాడు. ఈ ఉగ్ర రూపానికి గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. నవంబర్‌ 18 సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతమై చిరు వర్షపు జల్లులు కురిశాయి. ఇది వర్షమే కదా.. అని దివి ప్రజలు భావించారు. ఊహించలేదు రానున్న పెనుప్రమాదాన్ని. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఆయా ప్రాంతాలు చీకట్లు కమ్మాయి. దీంతో సముద్ర తీర ప్రాంతాలలో గ్రామాలలోని ప్రజలు ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఇంతలోనే పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు సంభవించడంతోపాటు భారీ వర్షం కురియ సాగింది. సముద్రుడు మరింత ఉగ్రరూపం దాల్చి అలలు తాడి చెట్టు ఎత్తున ఎగసిపడి గ్రామాలపై విరుచుకుపడ్డాయి. భారీ అలల నీటి ప్రళయంలో గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి.

రెండు గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది.
       సుమారు రెండు గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. ఇళ్లలోని ప్రజలు భయంతో దేవాలయాలలో, ప్రార్థనా మందిరాలలో, కమ్యూనిటీ భవనాలలో తలదాచుకున్నారు. మరికొంతమంది ఇంటి పై కప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా, మరికొందరు చెట్లు, చెట్ల కొమ్మలు ఎక్కి వేలాడారు. ఒక్కసారిగా సముద్రపు రాకాసి అలలు విరుచుకుపడడంతో ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వందలాది మంది మఅత్యువాతపడ్డారు. కొందరు చెట్ల కొమ్మలకు పట్టి ప్రాణాలు విడిచి వేలాడారు. ఎటు చూసినా శవాల గుట్టలే కనిపించాయి. పశువులు నీటి ప్రళయంలో కొట్టుకుపోయి మఅత్యువాత పడడంతో పశువుల కళేబరాలే కనిపించాయి. ఆయా ప్రాంతాలు శవాలు, పశువుల కళేబరాలతో కనిపించడంతో మఅతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భర్తలను కోల్పోయినవారు కొందరైతే, మరికొందరు భార్యలను కోల్పోయి, పిల్లలను సైతం కోల్పోయినవారు కొందరు. దీంతో దివిసీమ రూపురేఖలు మారిపోవడంతోపాటు గ్రామ గ్రామాలు చెదిరిపోయాయి.

దివిసీమ సేవలకు ముందుకొచ్చిన ప్రముఖులు..
         ఆనాటి శాసనసభ్యులు, మంత్రి మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి విశేష కఅషి చేశారు. ఉప్పెనలో చనిపోయిన మఅతుల శవాలకు స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు దహన సంస్కారాలను నిర్వహించారు. అప్పటి పోలీస్‌ ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ ఎన్‌వి.నారాయణ రావు, ఐపిఎస్‌ పోలీసు బలగాలను దింపి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామాన్ని దత్తత తీసుకొని భవనాలను నిర్మించడం తోపాటు అందుకు చిహ్నంగా స్థూపాన్ని కూడా నిర్మించారు. ఆ స్తూపం నేటికీ దివిసీమ ఉప్పెన కు చిహ్నం గా ఉంది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, సేవామూర్తి మదర్‌ తెరిసా, దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దివిసీమను సందర్శించి వారి సహకారాన్ని అందించారు.

తీవ్రంగా ఆస్తి, పంట నష్టం..
        దివిసీమ ఉప్పెన వందలాది గ్రామాలను తుడిచిపెట్టుకుపోవడంతో తీవ్ర ఆస్తి నష్టంతోపాటు, పంట నష్టాన్ని కలిగించింది. నాగాయలంక, కోడూరు మండలాలతోపాటు దివిసీమ లో సుమారు 20 వేల ఎకరాలకు పైబడి పంట నష్టం జరిగింది. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా కోట్లలో జరిగింది. ఆస్తి, పంట నష్టంతోపాటు రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామాలకు వెళ్ళడానికి ఎవ్వరికీ వీలు లేకుండా పోయింది.

          నవంబర్‌ 19 వస్తుందంటేనే దడ పుడుతుంది. వాతావరణంలో మార్పు సంభవిస్తే మళ్లీ ఎలాంటి ప్రళయం ముంచుకొస్తుందోనని వణుకుపుడుతోంది. 1977 నవంబర్‌ 19 అర్ధరాత్రి అది ఒక కాళరాత్రిగా మిగిలింది. దివిసీమ ఉప్పెన కు సముద్రం పొంగి ఊళ్లపై పై విరుచుకుపడటంతో వేలాదిమంది చనిపోయారు. తీవ్ర ఆస్తి, పంట నష్టం జరిగింది, దీంతో దివిసీమ శవాల దిబ్బగా మారింది. ఆనాటి జ్ఞాపకాలు నేటికీ మమ్ముల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం నవంబరు నెల వస్తుందంటే భయపడటమే కాకుండా, వరదలు, తుఫానులు, భారీ వర్షాలు కురవడంతో ఆందోళన కలుగుతోంది. అలాంటి కాళరాత్రి మళ్లీ ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాం.
                                                                          - జాలయ్యు సొర్లగొంది గ్రామస్తుడు.

దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు.. వెంటాడుతోన్న జ్ఞాపకాలు..!

దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు.. వెంటాడుతోన్న జ్ఞాపకాలు..!

దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు.. వెంటాడుతోన్న జ్ఞాపకాలు..!