Nov 29,2021 12:55

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : డిసెంబర్‌ 3, 4 తేదీల్లో ఉండి కోట్ల ఫంక్షన్‌ హాల్‌ లో జరిగే ఆక్వా టెక్‌ ఎక్స్‌ పో సదస్సులో ఆక్వా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్గనైజర్‌ కోన జోసఫ్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఉండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 1993, 94 వ సంవత్సరంలో టైగర్‌ రొయ్య వచ్చిందని తర్వాత కాలంలో వైరస్‌ కారణంగా టైగర్‌ రొయ్యల పెంపకం మానేశారని గుర్తు చేశారు. తర్వాత కాలంలో 2010 లో నెల్లూరు కు చెందిన బీదా మస్తాన్‌రావు తీసుకువచ్చిన వనామీ ద్వారా ఆక్వా రంగంలో విప్లవం వచ్చిందని అన్నారు. అప్పట్నుంచి రైతులందరూ రొయ్యల సాగుకు మొగ్గుచూపుతున్నారని గుర్తు చేశారు. తదనంతర కాలంలో రొయ్యల మేత లో నాణ్యత తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. డిసెంబర్‌ 3, 4 తేదీల్లో జరిగే ఆక్వాటెక్‌ ఎక్స్‌ పో కార్యక్రమంలో రైతులందరూ పాల్గని శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకుని ఆక్వా రంగంలో వఅద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉండి గ్రామ సర్పంచ్‌ కమతం సౌజన్య బెనర్జీ, ఉండి మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు దాసరి వెంకట కఅష్ణ, ఏఎంసి డైరెక్టర్‌ లు అంగర రాంబాబు, చింతలపాటి రఘుపతి రాజు, గొర్రుముచ్చు సుందర కుమార్‌, షేక్‌ జరీనా బేగం, ముదునూరి వెంకట లక్ష్మీ, క్రిస్టియన్‌ మైనారిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ కొర్రపాటి అనిత, నాయకులు కొత్తపల్లి రమేష్‌ రాజు, గుండాబత్తుల సుబ్బారావు, కమతం బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.