Nov 29,2020 19:10

అమరావతి : నివర్‌ తుపాను ప్రభావంతో ఎపి లోని పలు జిల్లాలలోని పంటలు వరద నీట మునిగాయి. ఈ నేపథ్యంలో.. డిసెంబర్‌ 2 న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించినట్లు జనసేన పార్టీ సోషల్‌ మీడియా వెల్లడించింది.
       నివర్‌ తుపాను ప్రభావిత జిల్లాల నాయకులతో పవన్‌ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నదానిపై చర్చించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, తదితర జిల్లాలు తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయాయి. ఈ జిల్లాల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీయడంతో పంటలు కోల్పోయి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించాలని పవన్‌ భావిస్తున్నారు.