Nov 30,2020 21:09

అంజాద్‌బాషాను సన్మానిస్తున్న ఖాసీం బ్రదర్స్‌

 కడపఅర్బన్‌ డిప్యూటీ సిఎం అంజాద్‌బాషాను ఖాసింఖాన్‌ సోదరులు, ఆడిటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు షరీఫ్‌ఖాన్‌, అల్‌హబీబా కళాశాలల చైర్మన్‌ అక్బర్‌ఖాన్‌ సన్మానించారు. సోమవారం కో-ఆపరేటివ్‌ కాలనీలో షరీఫ్‌ఖాన్‌ నూతన గృహ ప్రవేశవేడుకలకు హాజరయ్యారు. మాజీ మేయర్‌ సురేష్‌బాబు, వైవీయూ విసి సూర్యకళావతి, ఎఎస్‌పి ఖాసీంసాహెబ్‌, టూటౌన్‌సిఐ మహమ్మద్‌ అలీ, సంఘ సేవకులు సయ్యద్‌ సలావుద్దీన్‌, విద్యా సాధన కాలేజీ కరస్పాండెంట్‌ మన్సూర్‌అలీఖాన్‌, అబ్దుల్‌ కలామ్‌ సేవా సమితి అధ్యక్షులు, ఆడిటర్‌ పఠాన్‌ తౌహిద్‌ఖాన్‌, నగర ప్రముఖులు పాల్గొన్నారు.