Nov 09,2020 07:50

         దీపావళి పండగను సంతోషంగానే కాదు జాగ్రత్తగానూ జరుపుకోవాలి. మామూలు సమయాల్లోకన్నా ఈ కరోనా సమయంలో మరింత అప్రమత్తంగా ఈ పండగ జరుపుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
శానిటైజర్‌ను చేతులకు రాసుకుని టపాసులు కాల్చకూడదు. టపాసులు కాల్చిన తర్వాత సబ్బుతోనే చేతులు కడుక్కోవాలి.
 టపాసులు పేల్చే పిల్లల దగ్గర తల్లిదండ్రులు తప్పకుండా ఉండాలి.
 టపాసులు కాల్చేవాళ్ళు తప్పకుండా కాటన్‌ దుస్తులనే ధరించాలి.
 దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టేటప్పుడు కర్టన్‌లకు దూరంగా పెట్టాలి.
 కాకరపువ్వొత్తులు కాల్చాక వాటిని నీటి బక్కెట్టులో వేయాలి.
 మరీ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాంబుల జోలికి పోకపోతేనే మంచిది.
                                                                 గాయాలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
            కాలిన గాయం అయిన చోట పసుపు పేస్ట్‌లా చేసి, రాసుకుంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి చిన్న గాయం తగిలినా, వెంటనే పసుపు ఉపయోగించాలి.
దీపావళి సమయంలో ఇంట్లో తేనె ఉండేలా జాగ్రత్తపడాలి. ఎందుకంటే కాలిన గాయాలు మానడానికి ఇది మంచి రెమిడీ. ఇది కాలిన గాయాలను తగ్గించడమే కాదు, ఇన్ఫెక్షన్‌లు రాకుండా చేస్తుంది. గాయాలపై తేనెను పైపూతగా రాసి వదిలేయాలి. అలాచేస్తే సత్వర ఉపశమనం ఉంటుంది.
కాలిన గాయాలకు టూత్‌ పేస్ట్‌గానీ, ఫౌంటేన్‌ పెన్‌ ఇంకు కానీ రాయడం వల్ల ఉపశమనం ఉంటుంది. కాలిన ప్రాంతంలో చల్లగా అనిపించడమే కాదు, బొబ్బలు కూడా పెరగకుండా పనిచేస్తుంది.