Mar 02,2021 22:45

నిత్యావసరాలను అందజేస్తున్న కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌    స్థానిక కెటిఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపన్న హస్తాలు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. బృందంలో ఉన్న విద్యార్థులు ఇతరులకు సహాయం చేసేందుకు విరాళాలు సేకరిస్తారు. వచ్చిన విరాళాలతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం పట్టణంలోని భంభం స్వామి గుడి వద్ద ఉన్న హలీ క్రాస్‌ సోషల్‌ సర్వీస్‌ స్కూల్‌ విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఇక్కడ బధిర విద్యార్థులు ఉన్నారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. విద్యార్థులు చేస్తున్న సేవా దృక్పథాన్ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు నాగ సురేష్‌, గోవర్ధన్‌, ప్రసాద్‌, నాగేంద్ర ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.