Apr 28,2021 10:15

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర దిగొచ్చింది. నిన్నటి వరకు నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు తగ్గింది. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్‌ ఈల్డ్‌ వంటి పలు అంశాలు బంగారం రేటుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

హైదరాబాద్‌లో బంగారం ధరలు..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 తగ్గుదలతో రూ.48,460కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.140 క్షీణతతో రూ.44,450 కు తగ్గింది.

వెండి ధరలు..
వెండి రేటు మాత్రం పైకి ఎగబాకింది. వెండి ధర కేజీకి రూ.200 పెరుగుదలతో రూ.74,000కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా భావించవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌లో..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర నేల చూపులు చూసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం క్షీణతతో 1771 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది.