May 16,2021 08:03

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : భారత రక్షణ రంగ సంస్థ డిఆర్‌డిఒ ప్రముఖ మందుల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన కరోనా నియంత్రణ మెడిసిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ త్వరలో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఇఎస్‌ఐ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 సాచెట్‌ల మెడిసిన్‌ను ఇఎస్‌ఐ ఆస్పత్రి అధికారులకు డిఆర్‌డిఒ శనివారం అందజే ేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిఆర్‌డిఒ ఉన్నతాది óకారులు కోరారు. పొడి రూపంలో ఉండే ఈ మందును కరోనా బాధితులు ఉదయం, రాత్రి రెండుసార్లు ఆహారం తీసుకునే ముందు నీటిలో కలిపి ఐదు రోజులు వేసుకోవాలి.