
ప్రజాశక్తి-సంతనూతలపాడు రూరల్ : ఒంగోలు డెయిరీ ఉద్యోగులు, కార్మికులతో డెయిరీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లిం చాల్సిన జీతాలు, బకాయిలను వెంటనే చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యుఇఇయు) జిల్లా కార్యదర్శి జివి. రాగయ్య డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కంచాలని కోరుతూ ఒంగోలు డెయిరీ ఎదుట ఉద్యోగులు, కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరాయి. ఈ దీక్షలను జివి. రాగయ్య ప్రారంభించి మాట్లాడారు. దీక్షల్లో డెయిరీ ఉద్యోగులు వెంకటరావు, వి.సుభాష్బాబు, వి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాసులు, సిహెచ్ .సుబ్బారావు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ఉద్యోగులు నారాయణరావు, కాటూరి శ్రీనివాస్, ఈదర వెంకట్రావు, ఎం.శ్రీనివాస్, సిహెచ్. రాంబాబు, సాయి, రాఘవ, సుబ్బయ్య పాల్గొన్నారు.