
నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'దేవినేని'. నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో సంగీత దర్శకుడు కోటి నటిస్తున్నారు. త్వరలో సినిమా విడుదలకు సిద్ధమైంది.