Nov 27,2020 22:07

మాట్లాడుతున్న వైసిపి నాయకులు మారయ్య

ప్రజాశక్తి - చిప్పగిరి: గౌరమ్మ పండగ సందర్భంగా డిసెంబర్‌ 1, 2న ఓపెన్‌ కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని ఎంపిపి హేమలత భర్త, వైసిపి సీనియర్‌ నాయకులు జూటూరు మారయ్య తెలిపారు. శుక్రవారం ఆయన వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే వారు ఈ నెల 30లోపు ప్రవేశ రుసుం రూ.300 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు గోవిందప్ప స్పాన్సర్‌ చేయగా, రెండో బహుమతి రూ.15 వేలు ఎంపిపి హేమలత స్పాన్సర్‌ చేస్తున్నారని చెప్పారు. 3, 4వ బహుమతులను ధనంజయ, లాలూ స్వామి స్పాన్సర్‌ చేస్తున్నారని అన్నారు. టోర్నమెంట్‌కు వచ్చే వారందరికీ భోజన వసతి ఉంటుందన్నారు. టోర్నమెంట్‌ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ధనుంజయ, లాలూ స్వామి, నీలకంఠ పాల్గొన్నారు.