Oct 27,2021 07:39

అంకారా : టర్కీ, దాని మిత్రపక్షాలైన పశ్చిమ దేశాలు సోమవారం ప్రధాన దౌత్య సంక్షోభం తలెత్తకుండా నివారించాయి. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్న అంశంపై గల దౌత్య ఒప్పందాలకు తాము కట్టుబడి వున్నామని పది విదేశీ ఎంబసీలు ప్రకటించిన తర్వాత ఈ దౌత్య సంక్షోభం నివారించబడింది. దీంతో 10మంది రాయబారులను బహిష్కరించే ముప్పు కూడా తప్పింది. జైల్లో వున్న ధార్మికవాది ఉస్మాన్‌ కవ్లాను విడుదల చేయాలని కోరుతున్నందుకు 10దేశాల రాయబారులను '' దేశంలో ఉండదగని వ్యక్తులు''గా ప్రకటించాలని టర్కీ అధ్యక్షుడు తైపే ఎర్డోగన్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారాంతంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారు తమ డిమాండ్‌ విషయంలో వెనక్కి తగ్గారని, ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పారు.