
పాఠశాలలో ర్యాక్స్‌ను ప్రారంభిస్తున్న దాతలు
ప్రజాశక్తి-కారంచేడు : బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని ఎస్బిఐ ఇంకొల్లు బ్రాంచి మేనేజర్ బి.దేవేంద్రనాధ్ కొనియాడారు. విశ్రాంత విడిఒ దివంగత ఆరె నరసింహారావు, నాగలక్ష్మి జ్ఞాపకార్ధం రూ. లక్ష విరాళాన్ని వారి కుటుంబ సభ్యులు మంగళవారం అందజేశారు. రూ. 50 వేలు విలువైన ర్యాక్స్, పుస్తకాలు, కుర్చీలు అందించారు. మిగిలిన రూ. 50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. డిపాజిట్‌పై వచ్చే వడ్డీతో ప్రతి తరగతిలో మొదటి స్థానం వచ్చిన విద్యార్థినులకు నగదు బహుతులు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా దాతలు కావూరి నాగార్జున, గంగా భవానీ, ఉజ్వలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయురాలు వి.ఉదయకుమారి, పి.రామమోహన్‌రావు, మేడూరి సత్యనారాయణ, కె. మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.