Nov 30,2020 22:57

పురస్కారం అందిస్తున్న మానస

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డికి మరో అవార్డు లభించింది. 2020కి ఖమ్మం సైకియాట్రిక్‌ సొసైటీ ఆధ్వర్యాన డాక్టర్‌ భుజంగరావు స్మారక పురస్కారం ప్రకటించారు. 'మానసిక వైద్యంలో యోగ చికిత్స శాస్త్రీయత' అనే అంశంపై ప్రసంగించిన రామారెడ్డి 650 శాస్త్రీయ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ, ఆధునిక మానసిక వైద్యంలో యోగశాస్త్రాన్ని ఏవిధంగా సమన్వయ పరచుకోవచ్చో వివరించారు. పురస్కారాన్ని డాక్టర్‌ భుజంగరావుగారి విద్యార్థిని డాక్టర్‌ రామారెడ్డి కుమార్తె డాక్టర్‌ మానస ద్వారా అందింంచారు.