Feb 26,2021 21:30

డాక్టర్‌కు అవార్డు ప్రదానం చేస్తున్న దృశ్యం

డాక్టర్‌ హరిప్రసాద్‌కు అవార్డు ప్రదానం
ప్రజాశక్తి - గూడూరు :క్షయ వ్యాధి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్‌ టిబి డివిజన్‌ (సిటిడి) నిక్షరు ఆధ్వర్యంలో ఫైన్డ్‌ ఎన్‌జిఒ సంస్థ శుక్రవారం పట్టణ ప్రముఖ సిద్ధు చెస్ట్‌ అలర్జీ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ ఎన్‌. హరిప్రసాద్‌కు అవార్డు ప్రదానం చేశారు.
పట్టణంలోని గాంధీబొమ్మ వద్దనున్న సిద్ధు హాస్పిటల్లో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ వెంకట వరప్రసాద్‌ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకట వరప్రసాద్‌ మాట్లాడుతూ హరిప్రసాద్‌ ప్రభుత్వ టీబీ ఆస్పత్రికి ఎక్కువ సేవలందించారన్నారు. ఉచిత మందుల కోర్సుతో వ్యాధి నయమయ్యేందుకు కృషి చేశారన్నారు. అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎన్‌. హరిప్రసాద్‌ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్యక్రమంలో ఫైన్డ్‌ సంస్థ ప్రతినిధులు, హాస్పిటల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.