Oct 14,2021 15:30

కాకినాడ : అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సిఎం జగన్ ను విమర్శించారు. విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆదాయానికి మించి రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం చాటున సిఎం దోపిడీ చేస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై అయ్యన్న ఆరోపణలు చేశారు.