Jan 15,2022 11:50

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో.. 2.68,833 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. క్రితం రోజు కంటే అదనంగా నాలుగున్నర వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోందని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. కేవలం కరోనా కేసులు మాత్రమే కాదు.. కరోనా న్యూవేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఒమిక్రాన్‌ కేసులు 6041 నమోదయ్యాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 14 లక్షలు దాటి.. క్రియాశీల రేటు 3.85 శాతానికి ఎగబాకింది. శుక్రవారం ఒక్కరోజే లక్షా ఇరవై వేల మంది పైగా.. కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94.83 శాతంగా ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 402 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా 4.85 లక్షల మంది కరోనాతో మృతి చెందారు.