Oct 28,2021 18:29

ర్యాలీని ప్రారంభిస్తున్న న్యాయమూర్తులు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
చట్టం ముందు అందరూ సమానులేనని జిల్లా లీగల్‌ అథారిటీ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కరణ్‌కుమార్‌ అన్నారు. న్యాయవాద వారోత్సవాల్లో భాగంగా స్థానిక కోర్టు నుంచి గురువారం పట్టణ నాలుగు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న కరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలి, అందరూ చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్న లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా న్యాయవాదవారోత్సవాలు, న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ న్యాయం పొందడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి సీనియర్‌ సివిల్‌ జడ్జి అరుణ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోటేశ్వరరావు, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాఘవేంద్ర, న్యాయవాదులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.