Mar 02,2021 23:27

సమావేశంలో మాట్లాడుతున్న మానిటరింగ్‌ అధికారి పల్లా త్రినాథ్‌

ప్రజాశక్తి - మారేడుమిల్లి 'గిరిజన చట్టాలు అమలు చేసే బాధ్యత ఏజెన్సీలోని ప్రతి ఒక్క అధికారిపైనా ఉందని గిరిజన సంక్షేమశాఖ మానిటరింగ్‌ అధికారి డాక్టర్‌ పి.త్రినాధరావు పేర్కొన్నారు' మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో ఏడు మండలాలకు సంబంధించిన తహశీల్దార్లు, ఎంపిడిఒలు, పంచాయతీ, పోలీసు, ఎక్సైజ్‌, వ్యవసాయశాఖ, ఇరిగేషన్‌ శాఖ, ఇతర అధికారులతో గిరిజనులకు సంబంధించిన ప్రత్యేక చట్టాలపై శిక్షణ కార్యక్రమం మానిటరింగ్‌ అధికారి పల్లా త్రినాధరావు, రంపచోడవరం ఆర్‌డిఒ శీనా నాయక్‌, ఎపిఒ జనరల్‌ పివిఎస్‌.నాయుడు కలిసి నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఔటర్‌ రింగ్‌ అధికారి త్రినాధరావు మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనులకు మౌలిక వసతులతోపాటు ఆ గ్రామాల సంబంధించిన సమస్యలు పీసా చట్టం 1996 ప్రకారం ఎన్నికైన ప్రెసిడెంట్‌, సెక్రటరీ 1/ 3( 50 శాతం) పీసా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఏ పనికైనా ఉన్నతాధికారుల మంజూరు కోసం సిఫార్సు చేసే అధికారం ఒక సీసా గ్రామసభకు మాత్రమే అధికారం ఉంటుందని ఆయన తెలిపారు. వివిధ పథకాలకు సంబంధించిన పనులు గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేందుకు పీసా గ్రామసభల్లో తీర్మానించుకోవచ్చన్నారు. గ్రామంలోని భూములకు సంబంధించిన సమస్యలున్న పక్షంలో గ్రామసభ ద్వారా తీర్మానం చేసి, సంబంధిత అధికారులకు పంపొచ్చన్నారు. ఈకార్యక్రమంలో డిడి ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి ఎం.సరస్వతి, డిఎల్‌పిఒ హరినాథ్‌, ఎస్‌డిసి వెంకటేశ్వర్లు, ఎంపిడిఒలు, తహశీల్దార్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.