Oct 27,2021 09:40

అందమైన చందమామ
ఆకాశములో బంతిలా
మా పెరటి చెట్టుకు కాసే
మా ఇంటి పైకప్పుపై వెలిగే...

చేతికి ఏమో అందదు
కళ్లకు మాత్రం అందెను
వెన్నెల కురిపించెను
ఎదలో ఆనందం మొలిచెను..

ఆరుబయట ఆటలకు
వెన్నెల రేడు తోడుగా
ఎన్నెన్నో క్రీడలు
అందించెను వినోదాలు...

పిండి ఆరబోసినట్లు
కర్పూరం చల్లినట్లు
ఆకాశమంతా అద్భుతం
వెన్నెల వర్షం సుందరం...

చందమామని చూస్తూ
అమ్మ గోరుముద్దలు తింటూ
రాడని తెలిసిన మామ కోసం
రాతిరంతా ఎదురుచూపు....

బస్సులో పోతుంటే
నా వెంటే వస్తాడు
తోడుగా ఉన్నానంటూ
భరోసా అందిస్తాడు

మా మామ చందమామ
అందమైన చందమామ
ఆ పిలుపే ఆనందం
కనబడితే మహానందం !


- కొప్పుల ప్రసాద్‌
98850 66235