ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డికి అభినందనలు తెలుపుతున్న కాటసాని తిరుపాల్ రెడ్డి
ప్రజాశక్తి - బనగానపల్లె: వైసిపి ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డిని వైసిపి నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, బండి బ్రహ్మానంద రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. మంగళవారం అవుకులోని చల్లా భవన్లో ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డిని వైసిపి అవుకు మండల కన్వీనర్ తిరుపాల్ రెడ్డి, వైసిపి నాయకులు వంగల పరమేశ్వర రెడ్డి, బండి బ్రహ్మానంద రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం చల్లా భగీరథ రెడ్డితో కలిసి కీర్తిశేషులు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఘాట్‌కు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.