Dec 03,2021 19:23

వెల్లుల్లిలోని ఔషధ గుణాలు శీతాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శ్వాస, జీర్ణక్రియ రోగ నిరోధక సమస్యలను తొలగిస్తుంది. బయోయాక్టివ్‌ సమ్మేళనం అయిన అల్లిసిన్‌ వెల్లుల్లిలో సంవృద్ధిగా ఉంటుంది. కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, విటమిన్‌ సి, విటమిన్‌ బి6, ఫోలేట్‌, కోలిన్‌, బీటా కెరోటిన్‌ వంటి అవసరమైన విటమిన్లు ఇందులో లభిస్తాయి. అందుకే రోజూవారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలి.
- దీనిలో ఉండే యాంటీవైరల్‌, యాంటీమైక్రోబయల్‌ గుణాలు దగ్గు, జలుబు క్రిములతో పోరాడడంలో సహాయపడతాయి.
- వెల్లుల్లిలోని అల్లిసిన్‌ రోగనిరోధక వ్యవస్థను చురుకుగా చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
- వెల్లుల్లిలో ఉండే తామసి, రాజసిక్‌ కఠినమైన గాఢత లక్షణాలు శరీరంలో వేడిని పెంచి, చలికాలంలో శ్వాసకోశ సమస్యలు దూరం చేస్తుంది.
- వెల్లుల్లి రెబ్బల్లోని ఇథైల్‌ అసిటేట్‌, బీటా-హెక్సోసామినిడేస్‌లు ఉంటాయి. ఇవి రక్తంలో అలెర్జీలను నివారిస్తుంది.
- దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా రక్తంలోని కొవ్వు పదార్థాలను కరిగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
-  చలికాలంలో నోటి నరాలకు రక్తప్రసరణ తక్కువగా జరుగుతుంది. ఇది పంటి నొప్పికి దారి తీస్తుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్‌, ఆల్కలీనిటీ యాసిడ్‌ వల్ల దంత ప్రాంతాలకు రక్త సరఫరాను పెంచి, దంత క్షయం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.