
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
ఇటీవల తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమితులైన చక్రాల ఉషను ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పోరాటాల్లోనూ, పార్టీ బలోపేతంలోనూ ఉషకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. టిడిపి పట్టణాధ్యక్షుడు విజరుకుమార్నాయుడు, కంఠా రమేష్, దశరథాచారి, బషీర్, ప్రసాద్నాయుడు, నివేదిత, సుహాసిని, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.