Feb 27,2021 08:44

బెంగళూరు : చిరుతను చూస్తే.. ఎవరికైనా పై ప్రాణాలు పైకే పోతాయి. తప్పించుకునేందుకు పరుగులు తీస్తుంటారు. అలాంటిది.. 12 ఏళ్ల బాలుడు చిరుత దాడి నుండి ధైర్యంగా ఎదుర్కొని పరుగులు తీయించాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. చిరుతను ఎదిరించిన బాలుడి ఆత్మస్థైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. గతవారం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కడకోళ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు పాఠశాల నుండి తిరిగి వస్తుండగా.. ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. బాలుడు కూడా మెరుపు వేగంతో చిరుత ముఖంపై పిడి గుద్దులు కురిపించాడు. చిరుత కంటికి గాయం కావడంతో నొప్పి కారణంగా బాలుడ్ని వదిలి పరుగులుతీసింది. అయితే చిరుత దాడిలో బాలుని ముఖం, మెడ, ఛాతీపై గాయాలయ్యాయి. బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.