Oct 14,2021 20:23

న్యూఢిల్లీ : చిప్‌ల కొరతతో వాహనాల సరఫరా భారీగా తగ్గిపోయింది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన సెప్టెంబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల సరఫరా 41 శాతం తగ్గిందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్‌ఫాక్చరర్స్‌ (సియోమ్‌) గురువారం వెల్లడించింది. ముఖ్యంగా వాహన పరిశ్రమ వాడే సెమీకండక్టర్ల కొరత వల్లే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. దీంతో గడిచిన నెలలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 1,60,070కు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మాసంలో 2,72,027 యూనిట్ల అమ్మకాలు జరిగాయని సియోమ్‌ వెల్లడించింది.