Dec 05,2021 18:30

సమావేశంలో మాట్లాడుతున్న సద్దాం హుస్సేన్‌

చిన్న చెరువు లోతట్టు భూమిని కాపాడాలి : సిపిఎం
ప్రజాశక్తి - నంద్యాల

నంద్యాల చిన్న చెరువు లోతట్టు భూమి కబ్జాకు గురికాకుండా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా కాపాడాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. సిపిఎం నంద్యాల మండలం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి మండలం కార్యదర్శి డి.సద్దాం హుస్సేన్‌ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా డి.సద్దాం హుస్సేన్‌ మాట్లాడుతూ నంద్యాల చిన్న చెరువు సాగు, తాగునీరుకి ఇప్పుడున్న కాలంలో చాలా అవసరమన్నారు. నంద్యాల పట్టణంలో ప్రజలు తాగునీరు కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కబ్జాకు గురైన చెరువును తక్షణమే ప్రభుత్వం పరిశీలన చేసి కాపాడాలన్నారు. కబ్జా చేసి భూమిని అమ్ముకునే వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 9న కెసి కెనాల్‌ ఆఫీస్‌ ముందు టెంటు వేసి అన్ని రాజకీయ పార్టీలతో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు గోపాల్‌ రెడ్డి, శివ రెడ్డి, భూమా కష్ణా రెడ్డి, ఎస్‌డిపిఐ నాయకులు ఈక్బాల్‌ , రాయలసీమ సాగునీటి సంఘం నాయకులు భాస్కర్‌ రెడ్డి, కెవిపిఎస్‌ నాయకులు ఆల్పొన్స్‌, ఆవాజ్‌ కమిటీ జిల్లా నాయకులు ఎస్‌ మస్తాన్‌ వలీ, సిపిఎం జిల్లా నాయకులు ఏ.నాగరాజు, పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, మండల నాయకులు షేక్‌ హుస్సేన్‌ వలి, బండి రత్నమయ్య, ముళ్ల యూసుబ్‌, రామయ్య, నాగేంద్ర, బంగారు పాల్గొన్నారు.