Nov 29,2020 12:24

కరోనా మహమ్మారి
కర్కశత్వానికి
శ్రామిక జీవితాలు
చీకట్ల మయమైనై
శ్రమనమ్మిన చోట
దోపీడీదారుని హస్తం
చీకట్లనే విసురుతోంది
రైతులు పండించిన పంటని
దళారీలు నంజుకుని తింటూ
రైతు ఇంటిని
చీకట్లలోకి నెడుతున్నారు
మనుషులు
మాయా చీకట్లని
మనసులలో నింపుకుని
బ్రతుకుని
బారం చేసుకుంటున్నారు
చీకట్లంటే
రేపటి పగలు వెలుగులీనే
ఆత్మస్థైర్యం అయితే..
బతుకులకు అతుకులుండవు
                                     * కొత్తపల్లి మణీత్రినాథరాజు. 9949389296