Jan 15,2022 17:03

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : బైక్ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం వెల్లమెల్లి స్టేజి వద్ద బైక్ మీద ఉన్న ముగ్గురి వ్యక్తులలో ఒకరు గుర్రాల శ్రీను( 35) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.