Oct 27,2021 22:24

ప్రజాశక్తి-యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం షరతులకు తలొగ్గి రాష్ట్ర ప్రజలపై చెత్త పన్ను, ఆస్తి పన్ను వేయడం దారుణమని సిపిఎం నాయకులు విమర్శించారు. చెత్త పన్ను కట్టొద్దని, ఆస్తి పన్ను పెంచవద్దని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆద్వర్యంలో బుధవారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు.
పిఠాపురం 3, 4 వార్డుల్లో సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రజలపై జగన్‌ ప్రభుత్వం భారాలు వేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం విశ్వనాథం, కూరాకుల సింహాచలం, వనపర్తి సూర్యనారాయణ, జిఎన్‌.భాస్కర్‌, దంట్ల నాగేశ్వరరావు డేగల సత్తిబాబు, వి.స్టాలిన్‌, సుంకర సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పట్టణం మెట్ల కాలనీలో పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. నవంబర్‌ 8న మున్సిపల్‌ కార్యాల యం వద్ద నిర్వహించే ధర్నా కార ్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కారెం వెంకట ేశ్వరరావు, పచ్చిమాల వసంత కుమార్‌, భువనేశ్వరి, దైవకప పాల్గొన్నారు. ముమ్మిడివరం ముమ్మిడి వరం నగర పంచాయతీ పరిధిలోని రజకుల వీధి, వైదిన్‌ స్కూల్‌ ఏరియా, బొక్కా వారి చెరువు చుట్టూ ఇంటింటికీి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.దుర్గాప్రసాద్‌, సకిలే సూర్య నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో, గోడి కృష్ణమూర్తి, ఎస్‌కె.మహమ్మద్‌ హుస్సేన్‌, పాము బాలయ్య, బిఎస్‌.ప్రభుకుమర్‌, సిహెచ్‌.సత్యవేణి, టి.రాజేష్‌, సిహెచ్‌.శ్రీనివాసరావు, కె.సత్యవతి పాల్గొన్నారు. పెద్దాపురం సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 29న మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు ప్రయివేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని. ఈ ధర్నాలో ఎలక్ట్రికల్‌ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తుని పట్టణం 12, 18, 19 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్‌ 1వ తేదీన జరిగే నిరసన లో పట్టణ ప్రజలు అందరూ పాల్గొనాలని బి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్‌ ఎస్‌కె.పద్మ పాల్గొన్నారు.