Nov 04,2020 23:11

మృతి చెందిన సాయిచైతన్య

ప్రజాశక్తి-అద్దంకి: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మం డలంలోని మైలవరం గ్రామచెరువులో వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలేశ్వరపాలెం గ్రామానికి చెందిన తూమాటి నాగరాజు, శ్రీదేవిల పెద్ద కుమారుడు సాయిచైతన్య (9) మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి మైలవరం చెరువులో జరుగుతున్న ప్రొక్లెయినర్‌ పనులను చూసేందుకు చెరువు కట్ట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మృతుని తండ్రి నాగరాజు హైదరాబాద్‌లో ఉన్నాడు. స్వగ్రామంలో తల్లి వద్ద ఉంటూ ఏలేశ్వరపాలెం ప్రాథమిక పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.