Jul 31,2021 08:26

చేయి చేయి కలుపుదాం
చేతనైన సాయం చేద్దాం
పిడికిళ్ళు బిగించి కదులుదాం
అన్యాయ, అక్రమాలు ఎదురిద్దాం
వైషమ్యాలు రూపుమాపుదాం
సమత, మమత పంచుదాం
స్త్రీలను గౌరవిద్దాం
వారి అభిమానం పొందుకుందాం
గురువులను గుర్తించుకుందాం
వారి సూచనలు, సలహాలు విందాం
తల్లిదండ్రులను పూజిద్దాం
వారి ఆశీస్సులు తీసుకుందాం
సమానత్వంతో ఉందాం
సౌభ్రాతృత్వం పెంచుకుందాం
జాతీయ జెండాకు సెల్యూట్‌ చేద్దాం
జై హింద్‌ అని నినదిద్దాం
 

- కనుమ ఎల్లారెడ్డి
93915 23027