Oct 28,2021 19:33

'చౌదరి తేజేశ్వరరావు అనుభవాలు-జ్ఞాపకాలు' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎం.వి.ఎస్‌ శర్మ తదితరులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం : సంపన్న, భూస్వామ్య కుటుంబంలో చౌదరి తేజేశ్వరరావు జన్మించినా, దేశంలో విముక్తి కోసం ఎర్రజెండా సరైన మార్గంగా ఎంచుకోవడం స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వి.ఎస్‌ శర్మ అన్నారు. అటువంటి నాయకులను చూడడం ఒక ప్రేరణ అని ప్రశంసించారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా 17వ మహాసభల్లో సిపిఎం సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావు సాగించిన పోరాటాలపై ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురించిన 'చౌదరి తేజేశ్వరరావు అనుభవాలు-జ్ఞాపకాలు' పుస్తకాన్ని ఎం.వి.ఎస్‌ శర్మ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి ఇటువంటి త్యాగధనుల జీవిత చరిత్ర దోహదం చేస్తుందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ అందరూ ఈ పుస్తకాన్ని చదివి, అందులోని అంశాలను ఆకలింపు చేసుకుని ఆచరించాలన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌ మాట్లాడుతూ నయా ఉదారవాద విధానాలు చాలా వేగంగా అమలవుతున్న నేపథ్యంలో తేజేశ్వరరావు అనుభవాలు, జ్ఞాపకాలతో రూపొందించిన పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదివి అన్వయింపు చేసుకోవాలన్నారు. పుస్తకావిష్కరణలో పార్టీ జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కె.శ్రీనివాసు, పి.తేజేశ్వరరావు, జి.ఈశ్వరమ్మ, డి.గోవిందరావు తదితరులున్నారు.