Apr 14,2021 20:17

బీజింగ్‌ : కరోనా కల్లోలంతో అనేక దేశ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుంటే.. చైనా మాత్రం ఎగుమతుల్లో భారీ వృద్థిని నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో 30.6 శాతం వృద్థితో 241.1 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను సాధించింది. దీంతో ప్రపంచ వాణిజ్య డిమాండ్‌లో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. దిగుమతులు 38.1 శాతం పెరిగి 227.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య మిగులు 13.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.