Nov 28,2020 10:11

న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా సాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 41,332 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోల్చుకుంటే 4 శాతం తక్కువ. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌ కేసులు 93.51 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 492 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా మరణాలు 1,36,200లకు చేరుకున్నాయని ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో గడిచిన 24గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనాను అంతమొందించేందుకు అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ల సంస్థలకు ప్రధాని మోడీ శనివారం సందర్శించనున్నారు.