Feb 12,2021 11:01

అమరావతిబ్యూరో: శాసనరాజధానికి అవసరమైన భవనాల మినహా మిగతావాటిని అమ్మాలనే ఆలోచనకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని, ఆ భవనాలను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. శాసనసభలో అమరావతిలో రాజధానిని సమర్ధించి 30వేల ఎకరాలు వుండాలని చెప్పి, అమరావతిని మరింత అభివఅద్ధి చేస్తామని ఘనంగా ప్రకటించి ఇప్పుడు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో క్యాంపు కార్యాలయం తప్ప పరిపాలన రాజధాని కల నెరవేరదని తెలిపారు. రాజ్యాంగ నిబంధనలు, గతంలో సుప్రీంకోర్టు తీర్పుల వలన మూడు రాజధానుల చట్టం, సిఆర్‌డిఎ రద్దు చట్టాలు కొట్టివేయబడే అవకాశాలే ఎక్కువని పేరొకన్నారు. ఇప్పటికైనా పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి, విభజన హామీల అమలుకు,పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రామయపట్నంవద్ద మేజర్‌ పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, కడప ఉక్కు ఫాక్టరీ మున్నగు అంశాలపై కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర అభివఅద్ధికి కఅషి చేయాలని పేర్కొన్నారు. శివరామకఅష్ణన్‌ కమిటీ సూచించినట్లు శాఖాధిపతుల కార్యాలయాలను 13 జిల్లాల్లో ఏర్పాటు చేసి మంచి పరిపాలన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.