Nov 30,2020 19:45

ఇళ్ల స్థలాలను పరిశీలిస్తున్న జెసి

ప్రజాశక్తి - గణపవరం
భువనపల్లిలో ఇళ్ల స్థలాలను సోమవారం జెసి వెంకట రమణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 25వ తేదీ నాటికి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. గ్రామాల్లో స్థలాలు పూడికలు, లేఅవుట్లు సక్రమంగా ఉండేవిధంగా అధికారులు చూడాలన్నారు. స్థలాల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోతే సహింబోమన్నారు. ఆయన వెంట తహశీల్దార్‌ బి.సుందర్‌ సింగ్‌, ఎంపిడిఒ టిఎస్‌ మహాలక్ష్మి, విఆర్‌ఒలు ఉన్నారు.